Tuesday, March 30, 2010

పశువులు నెమరు వేస్తాయేం?, Rumination of cattles?




ప్రశ్న: ఒకసారి తినేసిన ఆహారాన్ని పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుని నములుతాయెందుకు?

జవాబు: ఆవులు, ఎద్దులు, గేదెల్లాంటి పశువులను నెమరు వేయు జంతువులని పిలుస్తారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానంలో భాగంగానే ఇవి నెమరు వేస్తాయి. వాటి పొట్టలోని జీర్ణాశయంలో నాలుగు గదుల్లాంటి భాగాలుంటాయి. అవి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారు మూడు రోజులు పడుతుంది. పశువులు తమకు లభించిన గడ్డి, మొక్కల్లాంటి మేతను నమిలి మింగకుండా మొదట నేరుగా మింగేస్తాయి. అలా మింగిన ఆహారం దాని జీర్ణాశయంలోని మొదటి గది ర్యూమన్‌ (rumen)లోకి చేరుకుని అక్కడ మెత్తబడి కొంత వరకూ జీర్ణమవుతుంది. అక్కడ ఇంకా జీర్ణం కాని గరకు, పీచులాంటి ఆహారపదార్థాలను పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుని దంతాలతో నిదానంగా మెత్తగా అయ్యేవరకూ నములుతాయి. దీన్నే నెమరు వేయడమంటారు. ఇలా మెత్తబడిన ఆహారం ఆవు జీర్ణాశయంలోని రెండో గది రెటిక్యులమ్‌ (reticulum)లోకి చేరుకుంటుంది. అక్కడ వడబోతకు గురైన ఆహారం మూడో గది ఒమేసమ్‌ (omasum)లోకి చేరుతుంది. అక్కడ ఇంకా బాగా జీర్ణమై అబోమేసమ్‌ (abomesum)లోకి వెళ్తుంది. అక్కడ పూర్తిగా జీర్ణమవుతుంది.
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...