Tuesday, March 30, 2010

చదరంగం సంగతేమిటి ? , Chess game -About?





చదరంగం ఆటే..ఒకరకము ఆట .. మరి ఇది ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది?

కొన్ని శతాబ్దాల క్రితం.. మన దేశంలో బలహైతు అనే ఓ రాజు ఉండేవాడు. అతడోసారి తన ఆస్థానంలో తెలివైనవాడిగా పేరున్న సిస్సా అనే వ్యక్తిని పిలిపించాడు.

'ఈనాటి ఆటలన్నీ బలం మీదనో, అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలాకాకుండా తెలివితో ఆడే, తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా?' అని అడిగాడు. సరేనన్న సిస్సా 64 గడులపై భట, సైనిక, హయ, గజ బలాలతో సాగే ఆటను రూపొందించి, 'చతురంగ' అని పేరు పెట్టాడు.

ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు 'ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి' అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి, తరువాత ప్రతి గడికీ వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకీ ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు. మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య 18,445,744,073,709,551,515 అని తేలుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశదేశాల్లో ప్రచారం చేస్తాడు. చెస్‌ పుట్టుక వెనుక ప్రచారంలో ఉన్న కథ ఇది!

* కథ పక్కన పెడితే చదరంగం పుట్టింది మన దేశంలోననే ఎక్కువ శాతం చరిత్రకారులు నమ్ముతారు. క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో దీన్ని ఆడినట్టు ఆధారాలున్నాయి. కొంతమంది మాత్రం చైనాలో పుట్టిందని చెబుతారు. అక్కడ రెండో శతాబ్దంలోనే చెస్‌ని పోలి ఉన్న క్సియాంగి అనే ఆటను ఆడేవారంటారు.

* ఇప్పుడు మనం ఆడుతున్న ఆటకు 15వశతాబ్దంలో పూర్తి రూపం వచ్చింది. ఇది ఒక క్రీడగా గుర్తింపు పొందింది 19వ శతాబ్దంలో. ప్రపంచంలో తొలిసారిగా 1851లో చదరంగం పోటీలను లండన్‌లో నిర్వహించారు. అధికారికంగా ప్రపంచస్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరిగింది మాత్రం 1886లో.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

2 comments:

  1. Your story is well known. But in Telegu there was a story called "Vadla ginja". Here, the story line is different. A village level chess player goes on winning in chess from his village to the capital city and finally defeats the king's top player in chess. In reward, this villager asks for one vadla ginja to be placed in one square of the chess board and goes on doubling the count on the subsequent square.
    Chess mate is derived from Persian word Shamat (meaning King is dead) not shamate
    Chess for invented in India. Originally it was called 'Ashtapaada". Here the board was divided into 64 squares with four armies - King, Elephant, Horseman, Boat and Foot soldiers. The peculiar movement of the Horse is the only thing that is common with the Modern Chess - where the knight moves in the same fashion as the ancient horseman. The pieces are placed on the four corners of the board and not facing each other as in the Modern game. The moves are made not by choice but by dice. Subsequently, the four armies were merged and made into two armies facing each other. That is why, we have elephants, bishops, horses in twos while the two kings earlier were transformed into King and Queen (Minister) and moves were made by choice not by dice.

    ReplyDelete

your comment is important to improve this blog...