ప్ర : చలికాలము లో చలికి వణుకుతామెందుకు ?
జ : చలిలో బయటకు వెళితే శరీరము వణుకుతుంది. దీనికి కారణము శరీర ఉష్ణోగ్రతకు బయట వాతావరణ ఉష్ణోగ్రతకు ఉన్న తేడా . ఉష్ణోగ్రత అధికము గా వున్న చోటనుండి తక్కువ ఉన్నచోటుకు ప్రవహిస్తుంది. అలా శరీరము నుండి చలి వాతావరణము లోకి ఉష్ణోగ్రత హఠాత్తుగా , వేగముగా ప్రవహించేసరికి దానికి స్పందనగా శరీర కండరాలు ఒక్క సారికా కదలినట్లవుతాయి. దాంతో శరీరము వణుకుతుంది. శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటేనే లోపలి శరీర వ్యవస్థ సక్రమముగా పనిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రతను స్థిరము గా నిలబెట్టుకునే యత్నములో శరీరము వణుకుతుంది.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...