Friday, November 07, 2014

Brahma and brahmachari relation?,బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

 జ : త్రిమూర్తులలోని వాడు , సరస్వతీ నాధుడు అయిన బ్రహ్మదేవునికీ , బ్రహ్మచారికి సంబంధము లేదు. వేద , ఉపనిషత్ .. ప్రతిపాధిత మయిన  బ్రహ్మపదార్ధమనే  మహాతత్వానికి  సంబంధించి ఈ బ్రహ్మచారి అనే శబ్ధాన్ని వాడడము జరిగింది.  ఆ బ్రహ్మపదార్ధాన్ని తెలుసుకొనే అన్వేషణా మార్గములో ఉన్నాడనే అర్ధముతో బ్రహ్మచారి అనే పదప్రయోగము చేశారు.
  • ==================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...