ప్రశ్న: ఫ్యాన్ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు?
జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్ మధ్య ఉన్న గాలి తొలగిపోయి తాత్కాలికంగా అక్కడ కొంత శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని నింపడానికి పక్కల ఉన్నగాలి తోసుకు వస్తుంది. ఆ గాలి తనతోపాటు ఆపిల్స్‌ను కూడా దగ్గరగా తెస్తుందన్నమాట.
ఫ్యాన్ నుంచి గాలి వీస్తున్నపుడు కూడా ఇదే సూత్రం క్యాలెండర్ కాగితాలపై వర్తిస్తుంది. పైనుంచి వేగంగా వచ్చే ఫ్యాన్ గాలి క్యాలెండర్ పేపర్ల వద్ద అంతకు ముందున్న గాలిని తొలగిస్తుంది. ఆ ప్రదేశంలో పీడనం తగ్గడం వల్ల క్యాలెండర్ కిందవైపు ఉండే గాలి అక్కడకు వస్తుంది. కింద నుంచి గాలి పైకి వచ్చినపుడు తేలికగా ఉండే క్యాలెండర్ కాగితాలు పైకి లేచి రెపరెపలాడుతుంటాయి.
- ప్రొ|| ఈవీ. సుబ్బారావు,-హైదరాబాద్
- ============================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...