Sunday, November 09, 2014

Electricity in Trains?,రైళ్లలో విద్యుత్‌ ఎక్కడి నుంచి వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
రైళ్లలో ఫ్యాన్లకు, లైట్లకు విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది?


జవాబు: మన ఇళ్లలో ఉన్న ఫాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు కొంత తేడా ఉంది. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు సుమారు 230 వోల్టుల విద్యుత్‌ శక్మం ఉన్న ఆల్టర్నేటింగ్‌ కరెంటు(ac) తరహా విద్యుత్‌లో నడుస్తాయి. రైళ్లు స్టేషన్‌లో ఆగి ఉన్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యాన్లు తిరగాలి కాబట్టి బ్యాటరీల ద్వారా నడిచే ప్రత్యక్ష విద్యుత్‌ (direct current)లో నడిచేలా ఉంటాయి.

వీటిని 'మోటార్లు' నడిపిస్తాయి. రైలు పెట్టెల కింద చాలా బ్యాటరీలు శ్రేణిలో కలిపి ఉంటాయి. రైలు నడుస్తున్నపుడు ఇరుసులకు సంధానించుకున్న విద్యుదుత్పత్తి సాధనాలు లేదా డైనమోలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా ఆ విద్యుత్‌తో ఎప్పటికపుడు బ్యాటరీలను ఛార్జ్‌ చేస్తారు. లైట్లు కూడా ఇదే బ్యాటరీల విద్యుత్‌తో నడుస్తాయి. ఆధునిక రైళ్లలో లెడ్‌ స్టోరేజి బ్యాటరీలకు బదులుగా ఘనస్థితి బ్యాటరీలను వాడుతున్నారు.

  • ============================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...