ప్రశ్న: మనం సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?
జవాబు: స్వచ్ఛమైన పదార్థం ఏ పద్ధతిలో తయారయినా గానీ గుణగణాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి D విటమిన్‌ను సూర్యరశ్మి ద్వారా పొందినా, ఆహారం ద్వారా పొందినా వాటిలో తేడా ఉండదు. ఆహారం ద్వారా లభించే D విటమిన్ ఒకే దఫాలో సరిపడినంత తీసుకోగలం. సాధారణ మనిషికి రోజుకు 15 నుంచి 20 మైక్రో గ్రాముల (మిల్లిగ్రాములో వెయ్యో వంతును మైక్రోగ్రాము అంటారు) 'డి' విటమిన్ అవసరం. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే చర్మంలో 'డి' విటమిన్‌తోపాటు క్యాన్సరు కారక ఉత్పన్నాలు కూడా వచ్చి చేరతాయి. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సాధారణంగా ఉదయం కాసేపు ఎండలో నడిచినా లేదా సాయంత్రం ఎండ ఉన్నప్పుడు కొన్ని నిముషాలు ఉన్నా మనకు అవసరమైనంత 'డి' విటమిన్ లభిస్తుంది.
'డి' విటమిన్ లోపిస్తే ఎముకలకు సంబంధించిన లోపాలు వస్తాయి. ఇందులో ప్రధానమైంది 'రికెట్స్' chole calciferol అనే పేరుతో D3 విటమిన్ సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో కొలెస్టరాల్ నుంచి తయారవుతుంది. ఇది ఆహారం ద్వారా కూడా దొరుకుతుంది. ergo calciferol కూడా దొరుకుతుంది. D2 విటమిన్ మాత్రం సూర్యరశ్మి సమక్షంలో సాధారణంగా లభ్యం కాదు. దీన్ని ఆహారం ద్వారా పొందాల్సిందే. ఈ రెండింటిని కలగలిపి D విటమిన్ అంటాము. ఈ విటమిన్లు ఎముకలు సమగ్రంగా, సక్రమంగా పెరిగేలా దోహదపడతాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...