Sunday, November 23, 2014

Sweating in Himalayas? - హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

జ : పోస్తుంది కాని కనబడదు . మనిషి క్షీరద విభాగానికి చెందిన జీవి కాబట్టి శరీరము మీద స్వేదగ్రంధులు తప్పకుండా ఉండాయి. క్షీరదాలు తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరముగా ఉంచుకునేందుకు శరీరము నుండి  నీటిని చెమట రూపములో బయటకు పంపుతుంటాయి. అది నిరంతరము జరిగే ప్రక్రియ . వేడి ప్రాంతం లోవారికి కనిపించినంత అధికం గా చెమట బయటకు  కనిపించకపోయినా హిమాలయాలలో ఉండేవారికీ చెమట పోస్తుంది. ఆ చలి ప్రాంతలలోవారి చెమట వెంట వెంటనే గాలిలో కలిసిపోతుంది. కాబట్టి చెమట పోయడమనే సహజ లక్షణము ఎటువంటి వాతావరణము లో ఉన్నప్పటికీ కొనసాగుతునే ఉంటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...