Friday, November 28, 2014

మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటామెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




 ప్రశ్న:మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటాం. ఎందుకు?

జవాబు: మనదేహం కచ్చితమైన సౌష్ఠవం కల్గి ఉండదు. మన కుడి కాలు ఎడమ కాలు కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. క్రీడాకారుల శరీర దారుఢ్యాన్ని నిర్ణయించే పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణయింది. అంతేకాకుండా ఎడమ కాలు కన్నా కుడి కాలు కొంచెం ఎక్కువ బలంగా ఉండి సులభంగా వంగే గుణం కల్గి ఉంటుంది. అందువల్లే ఏదైనా వస్తువును తన్నవలసి వస్తే మనం సాధారణంగా కుడి కాలునే ఎక్కువగా వాడుతాం. నడుస్తున్నపుడు కుడికాలును ఎడమ కాలి కన్నా కొంచెం పైకి ఎత్తుతాం. కుడికాలు ఎక్కువ బలం కల్గి ఉండటం వల్ల మనం నడుస్తున్నపుడు నేలను కుడి కాలి పాదంతో నెట్టినపుడు దాని ఫలితంగా ఉత్పన్నమయ్యే ప్రతిబలం ఎడమవైపునకు పనిచేస్తుంది. ఆ బలం ఎడమపాదం కుడివైపు ప్రసరింపచేసే బలం కన్నా ఎక్కువ ఉంటుంది. కుడికాలు వేసే అంగ, అది కలగచేసే ప్రతిబలం ఎక్కువ కావడం వల్ల ఈ రెంటి కలయిక మనం ఎక్కువ దూరం నడుస్తున్నపుడు మనల్ని అపసవ్య దిశలో కదిలేటట్లు చేస్తుంది. అందువల్ల వేగంగా నడుస్తున్నపుడు ఎడమవైపునకు ఒరుగుతూ ఉంటాం. నడకలో బ్యాలెన్స్‌ పోయినపుడు ఎడమవైపునకు ఎక్కువగా వాలిపోతాం. నడకలో బలంగా ఉన్న కుడికాలు ప్రాధాన్యత వల్లే ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు కుడికాలును ముందు పెట్టమని అంటారేమో!

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...