Friday, April 01, 2011

షాంపూ తో నురగ ఎలా వస్తుంది ? , What makes shampoo to give bubbles?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : షాంపూ తో నురగ ఎలా వస్తుంది ?

జ : కొంచము షాంపూ తలమీద వేసి రుద్దగానే బోలెడు నురగ వస్తుంది . నురగ అనేక సూక్ష్మ సబ్బుబుడగల సంయుక్త రూపము . షాంపూ తయారిలో వాడేది సబ్బు వంటి పదార్ధమే . దీనికి సులభము గా నీటిలో కరిగేటటువంటి గుణము ఉంటుంది . అటువంటి షంపూకు నీటిని కలిపి తలమీద రుద్దకోగానే బుడగలు ఏర్పడతాయి. తలపై ఉన్న వెంట్రుకల మధ్య గాలి ఉంటుంది . ఆ గాలితో కలిసినప్పుడు ఈ బుడగలు మరింత పెద్దవి అవుతాయి. . . అప్పుడే నురగ వస్తుంది .
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...