ప్రశ్న: రుచికి, వాసనకు మధ్య సంబంధం ఏమైనా ఉందా?
-కె. పవన్‌కుమార్, 8వ తరగతి, వరంగల్
జవాబు: మనం ఏదైనా ఆహారాన్ని తినేప్పుడు కానీ, ఏదైనా పానీయాన్ని తాగేప్పుడు కానీ రుచి, వాసనలు తెలుస్తాయి. వీటిని గుర్తించడంలో నోటిలోని నాలుక పాత్ర కన్నా, ముక్కు ప్రమేయమే ఎక్కువగా ఉంటుంది.వాసన, రుచులను మనం పూర్తిగా ఆస్వాదించడానికి కారణం ముక్కులోని శ్లేష్మం పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో ఉండే ఘ్రాణేంద్రియ కణాలే. నోటిలో, గొంతులో ముఖ్యంగా నాలుకపై జ్ఞానేంద్రియ కణాలు ఉన్నా, ఇవి తీపి, పులుపు, ఉప్పు, చేదులాంటి కొన్ని రుచులకే ప్రతిస్పందిస్తాయి. మనం తినే, తాగే పదార్థాల అణువులు ముక్కులోని ఘ్రాణేంద్రియ కణాలను చేరుకుంటాయి. ఇవెంత సున్నితమైనవంటే వేలాది వాసనల మధ్య తేడాలను చటుక్కున కనిపెట్టగలవు. ఈ కణాల నుంచి సంకేతాలను బట్టే ఎక్కువగా మన మెదడు ఆయా రుచులను పసిగట్టగలదు. దేన్నయినా తినేప్పుడు ముక్కు మూసుకుని దాని రుచిని తెలుసుకోడానికి ప్రయత్నిస్తే ఈ విషయం సులువుగా అర్థం అవుతుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...