Thursday, April 07, 2011

భారీ ఎలుగుబంటి సంగతేమిటి?,What about this big bear?


  • image : courtesy with Eenadu news paper hai bujji..
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


11 అడుగుల పొడవు... 1700 కిలోల బరువు... ఈ కొలతలు ఏ ఏనుగువో కావు... ఒక ఎలుగుబంటివి... వివరాలేంటో చూద్దామా!

కుక్కంత ఉండే ఎలుగుబంట్లు తెలుసు, మనిషంత ఉండేవి తెలుసు. మరి ఏకంగా ఏనుగంత ఉండేవి చూశారా? అలాంటి ఎలుగుబంటి గురించే ఇప్పుడు కొత్తగా బయటపడింది. ఇది రెండు కాళ్లపైనా మనిషిలా నిలుచుంటే ఎంత ఎత్తు ఉంటుందనుకుంటున్నారు? సుమారు ఏనుగంత. అమ్మో అని భయపడకండి. ఇప్పుడివి లేవు. ఎప్పుడో అంతరించిపోయాయి. అయినా కోట్ల ఏళ్ల క్రితం ఈ భూమిపై తిరిగిన ఓ ఎలుగుబంటి గురించి మనకెలా తెలిసింది? ఆ ఎలుగుబంటి శిలాజాల వల్ల.

సుమారు 76 ఏళ్ల క్రితం 1935లో అర్జెంటీనాలో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. అక్కడ పునాది కోసం తవ్వుతుంటే ఓ జంతువుకి సంబంధించిన అస్థిపంజరం బయటపడింది. దానిని ఆ ఆసుపత్రి యాజమాన్యం దగ్గర్లో ఉన్న మ్యూజియం వాళ్లకి ఇచ్చేశారు. శాస్త్రవేత్తలు ఇదేదో ఎలుగుబంటికి చెందినదై ఉంటుందని తేల్చి వదిలేశారు. తరువాత చాలా ఏళ్ల వరకు దాన్నెవరూ పట్టించుకోలేదు. ఇటీవలే కొందరు జీవశాస్త్రవేత్తలు మళ్లీ ఆ శిలాజాన్ని తీసి పరిశోధనలు చేశారు. అందులో బోలెడు కొత్త విషయాలు తెలిసాయి.

శిలాజాన్ని బట్టి ఈ ఎలుగుబంటి సుమారు 20 లక్షల ఏళ్ల నుంచి 5 లక్షల ఏళ్ల మధ్యలో జీవించిన జాతిదని తేలింది. 'సౌత్‌ అమెరికన్‌ జెయింట్‌ షార్ట్‌ ఫేస్డ్‌ బియర్‌' అని పేరు పెట్టారు. అంటే మనం దీనిని 'పొట్టి ముఖం ఎలుగుబంటి' అని పిలుచుకోవచ్చు. దొరికిన ఎముకల్ని బట్టి అంచనా వేస్తే ఇది నిలువుగా నిలుచుంటే సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందని తెలిసింది. అంతేకాదు బరువు కూడా 1700 కిలోలకు పైమాటే. ఆ కాలంలో భూమి మీద ఉన్న జంతువుల్లో భారీ, శక్తివంతమైన జంతువుల్లో ఇదీ ఒకటి. వేరే జంతువు వేటాడి తెచ్చుకున్న ఆహారం కోసం ఇది ఆ జంతువుతో పోరాటాలకు దిగేదట. అందుకే దీనికి చనిపోయే ముందు ఒంటి నిండా దెబ్బలే ఉండి ఉంటాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

* ప్రపంచంలో మొత్తం 8 ఎలుగు జాతులు ఉన్నాయి.
* ప్రస్తుతం అతిపెద్దది ధ్రువపు ఎలుగుబంటి. దీని బరువు వెయ్యి కిలోగ్రాములు
* ఎలుగుబంట్లు సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం నుంచి భూమిపై ఉన్నట్లు తెలుస్తోంది.

source : Eenadu News paper... hai bujji
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...