ప్రశ్న: కొన్ని కరెంటు వైర్లు షాక్ కొడతాయి కానీ, కొన్ని కొట్టవు. ఎందుకని?
-బి. రణధీర్, ధర్మారం
జవాబు: కరెంట్ షాక్ కొట్టాలంటే ఆ తీగలో తగినంత మోతాదులో విద్యుత్ పొటన్షియల్ ఉండాలి. అలాగే విద్యుత్ ప్రవాహ వలయంలో మన శరీరం కూడా ఒక భాగమై ఉండాలి. శరీరానికి అటూ ఇటూ ఉన్న బిందువుల మధ్య పొటెన్షియన్ భేదం బాగా ఉండాలి. మన ఇళ్లలోకి వచ్చే సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగకూ, నేలకూ మధ్య సుమారు 240 పొటెన్షియల్ ఉంటుంది. ఇలాంటి తీగను ఒక చేత్తో పట్టుకుని నేల మీద కాళ్లు ఆనిస్తే ప్రాణాపాయం కలిగే షాక్ తగులుతుంది. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో సింగిల్ ఫేజ్ తీగకూ, నేలకూ మధ్య పొటన్షియల్ తేడా కేవలం 115 వోల్టులే ఉంటుంది. అందువల్ల షాక్ తగిలినా ప్రాణాపాయం ఉండకపోవచ్చు. ఇక బస్సులు, రైళ్లు, కార్లలో ఏర్పాటు చేసే తీగల్లో బాగా తక్కువ వోల్టేజి ఉంటుంది. వాటిని పట్టుకుంటే జిల్‌మన్నట్టు ఉంటుంది కానీ అపాయం ఉండదు. సాధారణ టార్చిలైటులో బ్యాటరీలకు, బల్బుకు కలిపే తీగల వోల్టేజి 10 లేదా 12 వోల్టులకు మించదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...