కుందాం !.
జ : ప్రాధమిక పాఠశాలకు వెళ్ళే పిల్లలు సగటున ఒక గంట -ఇరవై నిముషాలు కంప్యూటర్ల పై గడుపుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నయి. నిద్ర పోయే ముందు ఒక గంట ముందుగా కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎక్కువగా ప్రభావితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు . ఏ వయసు పిల్లలు ఎంతసేపు ఆన్‌లైన్ లో ఉండవచ్చుననేది ఒక్కోదేశం ఒక్కోరకంగా లెక్కలు చెప్తుంది . అయితె 11 యేళ్ళ వయసులోపు పిల్లలు రెండు గంటలు మించి కంప్యూటర్ల్ స్క్రీన్ ముందు కూర్చున్నట్లైతే మానసిక సమస్యల రిస్కు 60 శాతము కంటే ఎక్కువ ఉంటుందని బ్రిటన్ లో జరిగిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సంతోషము గా లేని పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడడానికి ఇష్టపడుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు . అది పిల్లల ఎటెన్షన్ ను దెబ్బతీస్తుందని , ప్లానింగ్ , ఎటెన్షన్ , స్వయంనియంత్రణ లకు మెదడులో బాధ్యత వహించే కార్టెక్స్ దెబ్బతింటుందని వివిరించారు శాస్త్రజ్ఞులు. 2 గంటలు మించి కంప్యూటర్ గేమ్‌స్ ఆడినా , టెలివిజన్ చూసినా వారిలో ఎటెన్షన్ సమస్యలు రెండింతలు పెరుగుతాయి.
దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
* మణికట్టు వద్ద కండరాల నొప్పి
* మెడనొప్పి
* కుంగుబాటు
* భావోద్రేకాల్లో మార్పులు
* గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
* కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
* స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
* భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
* హోంవర్క్ పూర్తి చేయకపోవటం
* తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం
కంప్యూటర్ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
* కంప్యూటర్ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
* అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచాలి.
* అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
* కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
* పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.
--- డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం .
- ============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...