ప్రశ్న: క్లోరోఫాం అంటే ఏమిటి? దీనిని ఎందుకు వాడతారు?
జవాబు: క్లోరోఫాం (chloroform) ఓ సేంద్రియ ద్రవ పదార్థం (Organic liquid). ఇందులో అయొడీన్, కర్పూరం, నాఫ్తలీన్, నూనె వంటి ఎన్నో సేంద్రియ ఘన, ద్రవ పదార్థాలు కరుగుతాయి. పద్దెమిది, పందొమ్మిది శతాబ్దాల కాలంలో ఈ ద్రావణి బాష్పాన్ని (vapour) మత్తుద్రవ్యం (anesthetic)గా వాడేవారు. ఒక దశలో ఐరోపాలో పారిశ్రామిక విప్లవం జరిగిన రోజుల్లో దీన్ని నీటి బాష్పీ యంత్రం (steam engine) బదులు వాడేవారు. కానీ క్రమేణా దీనికున్న మండే స్వభావం (inflammable), మత్తు స్వభావం, ఇతర ప్రమాదకర లక్షణాల వల్ల ఆ విధమైన అనువర్తనాలు తగ్గాయి. ఎక్కవ కాలం నిలవ ఉంటే ఇది మరింత ప్రమాదకరమైన పాస్జీన్‌గా మారుతుంది.అయితే నేటికీ అనేక రసాయనిక పదార్థాలతో పాటు ప్రధానమైన ద్రావణిగా దీన్ని వేర్వేరు రకాలుగా ఉపయోగిస్తున్నారు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...