Sunday, October 28, 2012

Polished shoes shining Why?-పాలిష్‌ చేస్తే బూట్లు మెరుపేల?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: పాలిష్‌ చేయగానే బూట్లు తళతళా మెరుస్తాయి. అంతకు ముందు అవి మెరుపులేకుండా ఉంటాయి. ఎందుకని?

జవాబు: బూట్లను తయారు చేయడానికి వాడే చర్మపు ఉపరితలం సమంగా ఉండదు. ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుడులుగా ఉండే ఆ ఉపరితలంపై పడిన కాంతి కిరణాలు వేర్వేరు దిశల్లో చెల్లాచెదరైపోతాయి. అందువల్ల బట్ల ఉపరితలం మాసినట్టుగా కనిపిస్తుంది. అదే బూటుకు పాలిష్‌ పూసి, బ్రష్‌ చేసినప్పుడు బూటు ఉపరితలంలోని ఎగుడుడిగుడులలో పాలిష్‌ పరుచుకుంటుంది. అలా చదునుగా మారిన ఉపరితలం, కాంతికిరణాలకు ఒక నునుపైన అద్దంలాగా పనిచేస్తుంది. ఆ కిరణాలు ఒక క్రమపద్ధతిలో పరావర్తనం (reflection)చెంది మన కంటికి చేరడంతో బూటు ఉపరితలం తళతళ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...