Sunday, October 28, 2012

వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: లారీ, బస్సుల్లాంటి వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి. కానీ వాటి ముందువైపు మాత్రం కేవలం ఒక టైరు మాత్రమే ఉంటుంది. ఎందుకని?

జవాబు: బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు సాధారణంగా డీజిలు ఇంజనుతో నడుస్తాయి. పెట్రోలు ఇంజను కన్నా డీజిలు ఇంజను సామర్థ్యాన్ని భారీ వాహనాల తరలింపులో బెల్టులు, పుల్లీల ద్వారా సాధిస్తారు. భారీ వాహనాల సైజు బాగా ఎక్కువగా ఉండడం వల్ల పృచ్ఛ చోదక పద్ధతి (back wheel pushing)లో వాహనాన్ని నడుపుతారు. సాధారణ కార్లు, చిన్నపాటి వ్యాను తదితర మధ్య, కౌటుంబక(domestic)వాహనాలను ముఖచోదక పద్ధతి (front wheel pulling)లో నడుపుతారు. దీనర్థం ఏమిటంటే భారీ వాహనాలలో ఇంజనుకున్న చోదక శక్తిని వెనుక ఉన్న చక్రాల మీదకు ప్రసరింప చేస్తారు. అంటే వాహనాన్ని నెట్టే పద్ధతి ఇది. కానీ కార్లలాంటి చిన్న వాహనాలలో ఇంజను బలాన్ని ముందు చక్రాలకు సంధానిస్తారు. అంటే వాహనాన్ని లాగడం ద్వారా నడిపే పద్ధతి ఇది. వాహనం పెద్దదైనా, చిన్నదైనా యంత్రపు బలాన్ని గైకొనే చక్రాలు రోడ్డు మీద ఒత్తిడి, ఘర్షణల ద్వారా రోడ్డును వెనక్కు నెట్టేటట్టు పని చేసే బలానికి ప్రతి బలాన్ని న్యూటన్‌ మూడో సూత్రం ఆధారంగా పొందడం వల్ల స్వయం చోదకతను సాధిస్తాయి. అంటే రోడ్డు మీద ఎంత ఎక్కువ ఒత్తిడి కలిగిస్తే అంత మంచిది. రెండు చక్రాలు ఉండడం వల్ల అదనపు పట్టు(grip) వస్తుంది. ముందే రెండు చక్రాలుంటే మలుపులు తిరగడం కష్టమవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
=========================================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...