- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: మనిషి జీవించడానికి ఆక్సిజన్ అవసరం కదా? మరి చనిపోయినవారికి ఆక్సిజన్ ఇచ్చి బతికించలేమా?
జవాబు: ప్రపంచంలోని మరణాలన్నీ ఆక్సిజన్ లేకపోవడం వల్లే జరగడం లేదు కదా? కాబట్టి మరణానికి, ఆక్సిజన్ లేమి కారణం కాదు. మనిషులు కానీ, జీవులు కానీ బతికి ఉండడానికి ఆక్సిజన్ ఒక్కటే కారణం కాదు. మనం బతికి ఉండాలంటే మనకు ఆక్సిజన్‌తోపాటు నీరు, ఆహారం, రోగనిరోధక శక్తి, సరైన రక్తప్రసరణ, సరైన జీవభౌతిక ధర్మాలు, సరైన వాతావరణం కావాలి. ఇందులో కొన్ని బాహ్యకారకాలు కాగా, కొన్ని అంతర కారకాలు. బయట నుంచి ఎంత మంచి ఆక్సిజన్, ఆహారం, వాతావరణం లాంటివి కల్పించినా కాలక్రమేణా శరీరంలోనే కొన్ని కార్యకలాపాలు మందగించడం మొదలెడతాయి. ఆ స్థితినే మనం వృద్ధాప్యం లేదా అవసాన దశ అంటాము. మరికొన్ని రోజుల తర్వాత ఆ శరీర కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి. అదే మరణం. ఒకసారి మరణం సంభవించాక ఏ విధంగానూ బతికించడం సాధ్యం కాదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్ ,రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...