- ప్రశ్న: అప్పుడప్పుడు మన కడుపులోని పేగులు అరుస్తాయెందుకు?
-పి. రాజరత్నం, 9వ తరగతి, కరీంనగర్
- జవాబు: మనం ఆహారం తీసుకొన్న కొంత సేపటికి అది జీర్ణమై కడుపు ఖాళీ అవడంతో, దాంట్లో జీర్ణాశయ సంబంధిత ద్రవాలు, గాలి మాత్రమే ఉంటాయి. ఆహారం ఉన్నప్పుడు జీర్ణాశయపు గోడల సంకోచాలు క్రమంగా, నిశ్శబ్దంగా, నెమ్మదిగా జరుగుతుంటాయి. అదే కడుపు ఖాళీ అవగానే ఈ సంకోచాల తీవ్రత పెరుగుతుంది. ఆ కదలికల వల్ల కొన్ని శబ్దాలు ఉత్పన్నమవుతాయి. వాటినే మనం పేగులు అరుస్తున్నాయంటాం. వెంటనే నీరు తాగడం, లేదా ఆహారం తీసుకోవడం ద్వారా ఈ శబ్దాలు తగ్గిపోతాయి. పేగుల గుండా ఆహారపు గుజ్జు, గాలి పయనిస్తున్నప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు ఉత్పన్నమవుతాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...