Saturday, December 24, 2011

శ్వాసక్రియలో నత్రజని మాటెత్తరేం?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: గాలిలో ఆక్సిజన్‌ సుమారు 20 శాతం, నత్రజని సుమారు 80 శాతం ఉంటాయని పాఠాల్లో చదివాను. మరి మనం ఆక్సిజన్‌ పీల్చుకుని, కార్బన్‌డయాక్సైడు వదుల్తామని ఎందుకంటారు?

జవాబు: గాలిలో ఐదింట నాలుగు భాగాలు నత్రజని (Nitrogen) ఉంటుంది. మన శ్వాసక్రియ (respiration)లోని ఉచ్ఛ్వాస ప్రక్రియ (inhalation)లో గాలిలోని ఆక్సిజన్‌తో పాటు, నత్రజని కూడా వూపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కానీ ఆక్సిజన్‌కు మాత్రమే రక్తంలోకి చొరబడే లక్షణం ఉంది. జడతత్వం ఉండే నత్రజని వెళ్లిన దారినే తిరిగి నిశ్వాసం (exhalation) ద్వారా బయటకి వచ్చేస్తుంది. అయినా మనం ఆక్సిజన్‌ తీసుకుని నత్రజని వదులుతామని అనకూడదు. వదలడం అంటే అర్థం శరీరంలో ఉత్పత్తి అయిన పదార్థాన్ని విసర్జించడంగా భావించాలి. మనం తీసుకునే ఆక్సిజన్‌ మన శరీరంలోని పోషక పదార్థాలను ఆక్సీకరణం చేసి శక్తితో పాటు నీటి ఆవిరి, కార్బన్‌డయాక్సైడుగా మారుస్తుంది. ఈ కార్బన్‌డయాక్సైడు శరీరంలో ఉంటే ఆమ్లత్వం(acidity) పెరిగి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతాయి. కాబట్టి దాన్ని వదిలేస్తాము. లోపలికి వెళ్లి అదే దారిలో వచ్చేసే నత్రజనిని మనం వదలము. అదే బయటకి వచ్చేస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...