ప్రశ్న: వూసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తూ ఉంటుంది. ఎందుకు?,Chameleon changes colors Why?
జవాబు: వూసరవెల్లి తన శరీరపు రంగును పరిసరాలకు అనుగుణంగా మారుస్తుందనుకోవడం నిజం కాదు. కానీ దాని శరీరపు రంగులు మారతాయనేది మాత్రం నిజం. పరిసరాల్లోని ఉష్ణోగ్రత, వెలుతురు తీవ్రతల్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దాని చర్మం స్పందిస్తూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకోవడం, వాటి మానసికావస్థను తెలియ పరుచుకునే క్రమంలో కూడా ఈ రంగుల మార్పిడి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటి చర్మంలో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగుల మార్పు జరుగుతుంది. చర్మంలోని క్రోమోటోఫోర్స్ (chromotophores) అనే ప్రత్యేకమైన జీవకణాల వల్ల వేర్వేరు రంగులు ఒకేచోట ఏర్పడడమో లేక వివిధ ప్రదేశాలకు విస్తరించడమో జరుగుతుంది. వివిధ రకాలైన క్రోమోటోఫోర్స్ వేర్వేరు రంగులను మెరిసే స్ఫటికాల రూపంలో కలిగి ఉంటాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...