Thursday, December 08, 2011

చెట్లకు బెరడెందుకు?,Trees have bark Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చెట్ల కాండంపై బెరడు వల్ల ఉపయోగం ఏమిటి?

-ఎమ్‌. శ్రీశాంత్‌, 7వ తరగతి, మిర్యాలగూడ

జవాబు: బెరడు లేకుండా చెట్లు ఎక్కువ కాలం జీవించలేవు. పరిసరాల ప్రభావం నుంచి, దెబ్బలనుంచి చెట్లకు బెరడు రక్షణనివ్వడమే కాకుండా, కాండంలోని తడి ఆరిపోకుండా, ఫంగస్‌లాంటి జీవులు దాడి చేయకుండా కాపాడుతుంది. చెట్లలో సున్నితంగా ఉండే నాళికామయమైన కాంబియం(cambium) అనే పదార్థం చెట్ల కాండంపై బెరడు కిందనే ఉంటుంది. ఇక్కడే చెట్ల పోషణకు కావలసిన సరికొత్త ధాతువులు ఉత్పన్నమవుతుంటాయి. బెరడు లేకపోతే ఈ పదార్థం వాతావరణ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఆకుల నుంచి వివిధ వృక్షభాగాలకు గ్లూకోజ్‌ను అందించే నాళవ్యవస్థ చెట్ల బోదెపైనే ఉంటుంది. చెట్టుకు వేళ్ల ద్వారా అందే పోషక రసాలను పీల్చుకునే మెత్తని కొయ్యకు కూడా బెరడు రక్షణ ఇస్తుంది. కొన్ని చెట్ల కాండంపై బెరడు ఎంత మందంగా ఏర్పడుతుందంటే, అడవుల్లో చెలరేగే కార్చిచ్చు నుంచి ఉత్పన్నమయ్యే అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా ఇవి చెట్లను కాపాడగలుగుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...