Thursday, December 08, 2011

మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?,Can we detect Magic acts?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఇంద్రజాలం చేసేవారు కన్ను మూసి తెరిచేలోగానే చేతుల్లో వస్తువుల్ని మార్చుకుని అవే మారినట్టు నమ్మిస్తారు. అతి వేగంగా పనిచేసే కెమేరాతో ఆ మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?

-ఎస్‌. సూర్యనారాయణ, చెన్నై

జవాబు: ఒక సెకనులో 16వ వంతు కన్నా తక్కువ సమయంలో జరిగే సంఘటనలను మన కన్ను కనిపెట్టలేదు. మానవ నేత్రానికి ఉన్న ఈ పరిమితి ఆధారంగానే సినిమాలను మనం అవిచ్ఛిన్న చలన చిత్రం (continuous motion picture)గా చూడగలుగుతున్నాం. కాబట్టి సెకనుకు 16 సార్ల కన్నా ఎక్కువగా షట్టర్‌ తెరుచుకుంటూ, మూసుకుంటూ పని చేసే స్పీడ్‌ కెమేరాల సాయంతో ఇంద్రజాలికుని చేతి కదలికల్ని ఫొటోలు తీసి వాటిని విడివిడిగా చూస్తే అతడి హస్తలాఘవాన్ని దశలవారీగా గమనించవచ్చు. ఇప్పుడు ఇంతకంటే వేగంగా ఫొటోలు తీయగలిగే కెమేరాలు ఉన్నాయి కాబట్టి వాటితో చిత్రీకరిస్తే మ్యాజిక్‌ ఎలా జరిగిందో కనిపెట్టగలుగుతాము.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...