Friday, December 23, 2011

కాకి కాలు తలకి తగిలితే చావుకబురు వస్తుందంటారు . ఎందుకు ?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  • ప్ర : కాకి కాలు తలకి తగిలితే చావుకబురు వస్తుందంటారు . ఎందుకు ?
జ : అది ఒక మూడనమ్మకము . అందులో నిజము లేదు . ఎప్పుడైనా కాకికాలు మీ తలకి తగిలిందా? . ఎగిరే కాకి చూడడానికి చిన్నదైనా వేగముతో తలమీద వాలినప్పుడు చాలాబరువుగా ఉండి , కాలి గోళ్లు తలకి గుచ్చుకుంటాయి. ముక్కుతో పొడిచి జంతువుల జీలుగను , చనిపొయిన జంతువుల మాంసాన్ని , ఎంగిలి , కుళ్ళిపోయిన పదార్ధాలను కాలిగోళ్ళల్తో పీక్కుతింటాయి. వాటి గోళ్ళలో సూక్ష్మక్రిములు , అనారోగ్య పదార్ధాలు ఉంటాయి.

తలమీద వాలునప్పుడు ఆ ఊపులో మాడుకి గోళ్ళు తాకి అక్కడి చర్మము చిట్లి గాయము ఏర్పడి విషక్రిములు రక్తము లో కలిసే అవకాశము ఉంది . పూర్వకాలములో సరియైన వైద్యససుపాయాలు , సూక్ష్మక్రిముల అవగాహన లేకపోడముతో ...కాకి తలమీద వాలితే అనారోగ్యము. ఈ ఆనారోగ్యము నుండి కాపాడుకోవడానికి తలస్నానము చెయ్య మంటారు . . . దానినే చావుకబురు అని , అశుభవని కొందరు హడవుడి చేస్తూంటారు. అంతే . . . తలస్నానము మంచిదే కదా.
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...