ప్రశ్న: చంద్రుడి మీద ప్రదేశాలను కొన్ని దేశాలు నివాస ప్రాంతాలుగా రిజిస్టరు చేసుకొన్నాయని విన్నాను. అక్కడ మనిషి ఎలా నివసించగలడు?
జవాబు: భూమికి ఉపగ్రహమైన చంద్రుడి ఉపరితలం మీద వాతావరణం దాదాపు శూన్యం. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి మన లెక్కలో ఒక నెల పడుతుంది. అందువల్ల చంద్రుడి మీద పగలు 14 రోజులు ఉంటే, రాత్రి 14 రోజులు ఉంటుంది. పగలు దాదాపు 120 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత, రాత్రి సుమారు మైనస్ 170 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత ఉండే అక్కడి వాతావరణ పరిస్థితులు జీవుల మనుగడకు అనువైనవి కావు. అయితే అంతరిక్ష పరిశోధనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో చంద్రుడిపై కృత్రిమమైన ఆవాసాలను ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భవిష్యత్తులో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మానవ నివాసాలను ఏర్పాటు చేయగలమా లేదా అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...