ప్రశ్న: నూనె నీళ్లలో కలిసినప్పుడు రంగురంగుల వలయాలు ఏర్పడతాయి. ఎందుకు?
-ఆర్. అభిరామ్, పాల్వంచ (ఖమ్మం)
జవాబు: నూనె నీళ్లపై ఒక పొరలాగా ఏర్పడి తేలుతుంది. నూనె సాంద్రత, నీటి సాంద్రత కన్నా తక్కువ కావడమే ఇందుకు కారణం. అలా పరుచుకునే నూనె పొర మధ్య భాగం ఉబ్బెత్తుగాను, చివర్లలో పలుచగానూ ఉంటుంది. దీని మీద పడే సూర్యకిరణాలు నూనె పొర నుంచే కాక, దానికి నీటికి మధ్య ఉండే తలం నుంచి కూడా పరావర్తనం (reflection)చెందుతాయి. రెండు తలాల నుంచి పరావర్తనం చెందే ఈ కిరణాలు పయనించే దూరంలో కొంత తేడా ఉంటుంది. దీనిని పథాంతరం (path defference) అంటారు. కాంతి తరంగ రూపంలో ఉంటుంది కదా. నూనె, నీటి పొరల మీద పడిన కాంతి తరంగాలు ఒకదానితో మరొకటి వ్యతికరణం (interference)చెందుతాయి. అందువల్ల సూర్యకాంతిలోని రంగులు పథాంతరాన్ని బట్టి మన కంటికి వలయాలుగా కనిపిస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...