ప్రశ్న: చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు. ఎందుకని?
-ఎ. రాంబాబు, 10వ తరగతి, గుంటూరు
జవాబు; బ్యాటరీలో ఉండే రెండు లోహపు పలకల మధ్య రసాయనిక చర్యల ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించే తీరును బట్టి అది ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి. ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతవతరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాటిని కొంచెం వేడి చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. చలికాలంలో మోటారు వాహనాలు వెంటనే స్టార్ట్ కాకపోవడానికి కూడా ఇదే కారణం.
-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్.
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...