Tuesday, October 25, 2011

పిరానా చేపలు-సంగతులేమిటి ?, What about Piranah Fish?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


పదునైన పళ్లు... విపరీతమైన ఆకలి... గుంపుగా దాడి... అదే పిరానా చేప! వీటి గురించి కొత్త విషయం తెలిసింది... ఇవి తమలో తాము మాట్లాడుకుంటాయిట!

పిరానా చేపలు గురించి పరిశోధన చేసి శాస్త్రవేత్తలు తెలుసుకున్న సంగతులే తమలో తాము మాట్లాడుకుంటాయిట. అచ్చం ఇలాగే తెలుగులో మాట్లాడుకోకపోయినా, పిరానా చేపలు తమలో తాము కొన్ని ధ్వనుల ద్వారా భావాలను వ్యక్తీకరించుకుంటాయని కనిపెట్టారు. అలా అవి చేసే శబ్దాలను, వాటి ప్రవర్తనలను విశ్లేషించి మూడు రకాల సందేశాలను కనుక్కోగలిగారు. అవే పై సంభాషణలు! చేపల్లో భావ ప్రకటన ఉంటుందని ముందే తెలిసినా, ఇంత కచ్చితంగా తెలుసుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

దక్షిణమెరికాలోని మంచి నీటి చెరువుల్లో నివసించే పిరానా చేపల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటి పళ్లు పదును దేలి గట్టిగా ఉండడంతో పాటు ఇవి గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని వేటాడుతాయి. ఏ జలచరమైనా వీటికి దొరికితే క్షణాల్లో అది అస్థిపంజరంలా మారిపోతుందని చెబుతారు. మనుషులపై సైతం ఇలాగే దాడి చేస్తాయనే భయాలున్నాయి. వీటి పళ్లను కొన్ని దేశాల్లో పరికరాల, ఆయుధాల తయారీకి ఉపయోగిస్తారు. వీటిపై బోలెడు సినిమాలు కూడా తీశారు.

పిరానాలలో సుమారు 25 జాతులు ఉన్నాయి. వీటిలో ఎర్రపొట్ట (రెడ్‌ బెల్లీడ్‌) పిరానా జాతి చేపల పైనే ఈ పరిశోధన జరిగింది. వీటిని పెద్ద అక్వేరియంలో పెట్టి అందులో సున్నితమైన శబ్దాలను సైతం నమోదు చేసే పరికరాలను, వీడియో కెమేరాలను ఏర్పాటు చేశారు. ఏ సందర్భాల్లో ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయో, అవి విని మిగతావి ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించారు. ఇవి కోపాన్ని, అసహనాన్ని, హెచ్చరిక ధోరణిని తెలిపేందుకు ఎలాంటి ధ్వనులు చేస్తాయో గమనించారు. ఈ శబ్దాలను నోటితో కాకుండా కొన్ని కండరాలను కదిలించడం ద్వారా చేస్తున్నాయని తెలుసుకున్నారు.

===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...