ప్రశ్న: మన శరీర ఉష్ణోగ్రత అన్ని భాగాల్లోను, అన్ని వేళల్లోను ఒకేలా ఉంటుందా?
-కె. జోగారావు, 10వ తరగతి, రాజమండ్రి
జవాబు: మన శరీరంలో ఉష్ణస్థాపకం (థెర్మోస్టాట్) లాంటి వ్యవస్థ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది మన శరీర ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.6 ఫారెన్‌హీటు) వద్ద స్థిరంగా ఉంచుతుంది. అయితే ఇది మెదడు, దేహ అంతర్భాగంలో మాత్రమే స్థిరంగా ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి, కండరాల క్రీయాశీలత (యాక్టివిటీ) స్థాయిని బట్టి చేతుల, కాళ్ల ఉష్ణోగ్రతలు కొన్ని సార్లు హెచ్చుతగ్గులు చూపించవచ్చు. అలాగే ఒక వ్యక్తి నిద్రపోయేప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కలిగే మార్పుల వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దేహ పరిశ్రమ వల్ల అలసట కలిగినప్పుడు దేహ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాంటి సమయంలో కొంచెం సేపు నిద్రపోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత యధాస్థితికి వస్తుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...