ప్రశ్న: మెరుపుతో కూడిన పిడుగు ఎంత పరిమాణంలో ఉంటుంది?
-వెరోనికా డేవిడ్, విజయవాడ
జవాబు: ఒక మిల్లీసెకండు కాలంలో మెరుపుతో కూడిన పిడుగు 20,000 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఉద్గారిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2 లక్షల వోల్టులు. మెరుపు పిడుగు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మొదట్లో గాలిలో గొట్టంలాంటి మార్గం ఏర్పడి, అందులోని అణువులు అయనీకరణం(Ionisation) చెందుతాయి. పిడుగులు పయనించే మార్గాలు పలుమార్లు తమ దిశలను మార్చుకుంటాయి. అందువల్లనే ఆ విద్యుత్ ఉత్సర్గ మార్గాలు (Electric Discarge Paths) వంకరటింకరలుగా ఉంటాయి. ఆకాశంలో విద్యుత్ ఉత్ప్రేరితమైన మేఘాలకు, భూమి ఉపరితలానికి మధ్య మెరుపులతో కూడిన పిడుగులు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పొడవును సంతరించుకుంటాయి. రెండు మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం ఏడు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది. ఈ ఉత్సర్గం కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...