ప్రశ్న: గడ్డాలు, మీసాలు పురుషులకే ఎందుకు వస్తాయి? ఆడవారికి ఎందుకు రావు?
జవాబు: పుట్టుకతోనే ఆడ, మగ పిల్లల్లో ఉండే శారీరక వ్యత్యాసాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు(Primary sexual characteristics)అంటారు. పిల్లలు పెరిగే క్రమంలో మరికొన్ని మార్పులు శరీరం బయట, లోపల కూడా ఏర్పడుతాయి. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary sexual characteristics)అంటారు. ఉదాహరణకు జంతువుల్లో కోడి గుడ్డులోంచి వచ్చే పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని ప్రత్యేకమైన ఈకలు వచ్చి పెట్టలుగా, పుంజులుగా మారడం, పుంజు మాత్రమే కొక్కొరొకో అని కూయగలగడం, అలాగే మగ నెమలికి మాత్రమే పింఛం రావడం మొదలైన లక్షణాలను గమనించవచ్చు. మనుషుల్లో గడ్డాలు, మీసాలు మగవారికి మాత్రమే ఏర్పడడం కూడా ద్వితీయ లక్షణాలలో భాగంగానే. ఇందుకు కారణం స్త్రీపురుష శరీరాల్లో కొన్ని హార్మోన్లు ప్రత్యేకంగా వృద్ధి చెందడమే. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోను ఎక్కువగాను, ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగాను ఉంటాయి. అదే ఆడవారిలో ఈస్ట్రోజన్ పరిమాణం ఎక్కువగాను, టెస్టోస్టిరాన్ తక్కువగాను ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం వల్లనే ఈ తేడాలు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...