ప్రశ్న: మామూలు నీటికి, మినరల్ వాటర్‌కి తేడా ఏమిటి? మినరల్ వాటర్ ఎందుకంత రుచిగా ఉంటుంది?
-కొత్తూరి రాజు, చిట్యాల (వరంగల్)
జవాబు: మామూలుగా మనం తాగే మంచినీటికి, మినరల్ వాటర్‌కీ తేడా ఉండకూడదు. కానీ మున్సిపాలిటీ నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒకోసారి వివిధ కారణాల వల్ల తాగడానికి పూర్తిగా అనువుగా ఉండక పోవచ్చు. చెరువులు, ఆనకట్టలు, నదుల్లోంచి సేకరించి శుద్ధి చేసే ప్రక్రియలోనో, ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ నీటిని కాచి వడపోసుకుని తాగితే సరిపోతుంది. ఇక మినరల్ వాటర్‌ని సాధారణంగా బోరు బావుల్నుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా తొలగించి, ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు. తగుపాళ్లలో అన్ని పదార్థాలూ ఉండడం వల్ల మినరల్ వాటర్‌కి ప్రత్యేక రుచి చేకూరుతుంది. మినరల్ అంటే లవణ పదార్థమని అర్థం.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...