ప్ర : మూడు రంగుల దారాన్ని ఉపయోగించి దీపాన్ని వెలిగించేది ఎందుకు ?
జ : ఇది ఒక ఆద్యాత్మిక నమ్మకం. మన పూర్వీకులు ఏ మతానికి చెందిన వారైనా కొన్ని ఆచారాలు ఎందుకు పాటించారో ఇప్పటికీ అంతుపట్టడం లేదు . పుట్టే బిడ్డకు అమ్మ పైన నమ్మకం ... అంతా తనకోసం మంచే సేస్తుందని . అంతే నమ్మకం తో మనము దేవుని కొలుస్తాము ... నమ్ముతాము అంతా మనకోసం మేలే చేస్తాడని . మూడురంగుల దారాల ఒత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించడం పురాతనమైన సంప్రదాయము . దీనిలో తమ వారంటే తమకున్న ప్రేమను తెలియజెప్పే చర్య ఉన్నది . ఇంట్లో యజమానికి జబ్బుచేస్తే మూడురంగుల దారాలతో ఏడు పేటల వత్తి చేసి నెయ్యి లేదా ..నూనె లేదా .. ఆముదం మట్టి ప్రమిదలలో ఈ రంగుల వత్తి వేసి పూజా గదిలో వెలిగిస్తారు .
ఏమి జరుగుతుందో తెలియదు కాని ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు . నమ్మకము మనసు కి బలమైన శక్తిని , ప్రశాంతిని ఇస్తుంది . ఆ నమ్మకం తోనే వారిని అలా ఉండనివ్వండి . నమ్మకాలు ఎప్పుడూ మూడనమ్మకాలు కాకూడదు ... మూడనమ్మకాలు అనర్ధాలకు దారితీస్తాయి.
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...