Tuesday, June 21, 2011

దశవిధ పాపములు అంటే ఏమిటి ?, What are ten sins in Hindu epics?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : దశవిధ పాపములు అంటే ఏమిటి ?, What are ten sins in Hindu epics?
జ:
1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,
2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,
3. పర స్త్రీని కలవడం - ఇవి మూడు శరీరం తో చేసేవి.
4. పరుషము(కోపము ),
5. అసత్యము(అబద్దము ),
6. కొండెములు(చాడీలు చెప్పుట),
7. అసంబద్దమైన మాటలు - ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.
8. ఇతరుల ధనములందు కోరిక,
9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,
10. వ్యర్ధమైన అహంకారము - ఇవి మూడూ మానసికంగా చేసేవి................ఇవే పదిరకాలైన పాపాలు.

ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.
ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.
  • ========================================
visit My website > Dr.Seshagirirao -

No comments:

Post a Comment

your comment is important to improve this blog...