ప్రశ్న: అణుబాంబు పరీక్షల విషయంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపిస్తారెందుకు?
-కె. వైకుంఠం, ఇంటర్, అనంతపురం
జవాబు: ప్రపంచంలోని వివిధ దేశాలు 1945 నంచి అణుబాంబు పరీక్షలు చేయడంలోని ఉద్దేశం, ఎక్కువ శక్తిమంతమైనవాటిని రూపొందించాలనే. కానీ ఈ పరీక్షలు భూమి యొక్క నిర్మాణ క్రమాన్ని కూడా వివరంగా తెలుపుతాయి. ఎందుకంటే అణుబాంబుల విస్ఫోటనం, భూకంపంలాగానే భూమిని కంపింపజేస్తుంది. భూకంపం వల్ల ఉత్పన్నమయ్యే సీస్మిక్ తరంగాలు భూమి అంతర్భాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ పరావర్తనం (Reflection), విక్షేపణం (Dispension) చెందడంతో వాటిని బట్టి భూగర్భ లోతుల్లోని నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కానీ ఆ విధంగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయో కచ్చితంగా తెలియదు. అదే అణుబాంబు విస్ఫోటన సమయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి, భూగర్భ శాస్త్రవేత్తలు ఆయా పరికరాలను అమర్చుకుని సీస్మిక్ తరంగాలను అధ్యయనం చేస్తారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...