Tuesday, June 14, 2011

కరెంటు తీగ తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?,Do sea give shock if a electric wire falls in it?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్ర : అత్యదిక విద్యుత్తు ప్రవహిస్తున్న కరెంటు తీగ అనుకొకండా తెగి సముద్రంలొ పడితె సముద్రం మొత్తం షాక్ వస్తుందా?

జ : ఎంత విద్యుత్తు అయినా,ఎక్కడి విద్యుత్తైనా చివరికి ప్రవహించెది భూమిలొకె.విద్యుత్పత్తి కెంద్రాల్లొ.జనరెటర్ల లొ ఉత్పత్తి అయ్యె విద్యుత్ ఫెజ్ ,న్యుట్రల్ అనె రెండు తీగల గుండా వెళ్తుంది.వీటిలొ ఫెజ్ లొ మత్రామె విద్యుత్తు ఉంటుంది.న్యూట్రల్ అంటె విద్యుత్ వలయాన్ని పూర్తి చెయాడానికి వాడె సింక్ లాంటిదన్నమాట ఈ న్యుట్రల్ అంటె భూమె!భూమిలొ అత్యదిక బాగాన్ని అక్రమించి ఉన్న సముద్రంలొకి అదిక విద్యుత్తు ఉన్న తీగ తెగిపడినా ఆ విద్యుత్తు మొత్తం సముద్రంలొకి ఇంకిపొతుంది.సముద్రానికి కాని సముద్ర జల చరాలకు కాని ఎ మాత్రం షాక్ కొట్టదు.సముద్రం మొత్తం భూమికి అంటుకొకుండా విడిగా ఉన్నట్లైతె అప్పుడు మనం ఒక చెయ్యి సముద్రంలొను,మరొ చెయి భూమి మీద పెడితె మనకు షాక్ కొడుతుంది.కాని సముద్రాన్ని భూమి నుమ్చి విడదీయలెం కదా!

  • ========================================
visit My website > Dr.Seshagirirao -

No comments:

Post a Comment

your comment is important to improve this blog...