ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : ఎలర్జీ కొందరికి ఎందుకు వస్తుంది ?
జ : ఉన్నట్లుండి గొంతు గరమంతుంది , మరుసటి రోజు ముక్కునుండి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది . మరొ కరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరుకారడం ప్రారంభమవుతుంది . మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది . శ్వాస వదిలేటప్పుడు పిల్లికూతలవంటి శబ్దం వస్తూ ఉంటుంది . ఇంకొకరి హఠాత్తుగా కాళ్ళు , చేతులు వేళ్ళ మధ్య దురద ప్రారంభమవుతుంది . ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి ... అదే అలర్జీ (allergy) అంటారు. . ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్(Allergen) అంటారు.
మన చుట్టూ ఎన్నోరకాల సూక్ష్మజీవులున్నాయి. ఈ సూక్ష్మ పదార్ధాలు , రసాయనాలు , పుప్పొడిరేణువులు , ధూలి, దుమ్మి వంటివి ......... గాలి , నీరు , బట్టలు , ఆహారపదార్ధములు ద్వారా వచ్చి మనకు చేరుతాయి లేదా తాకుతాయి . వీటన్నిటిమీద తగిన చర్య చూపుతూ శరీరము , వ్యాధినిరోధక వ్యవస్థ తనను తాను రక్షించుకుంటుంది . అయితే వీటిలో కొన్నింటిమీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రముగా ఉంటాయి . అదే ఎలర్జీ. ఇవి అందరిలో ఒకేలా ప్రభావము చూపవు . ఒక్కొక్కరికి ఒక్కో పదార్ధము పడకపోవచ్చును . శరీరము ఎలర్జెన్ లకు స్పందించినప్పుడు " హిస్టమిన్" అనే పదార్ధము పుడుతుంది . దీని ప్రభావము వల్ల చర్మము మీద మంట , దురద , దద్దుర్లు , శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...