Wednesday, June 22, 2011

చదువుతుంటే నిద్రొస్తుందేమి?, Why do we get sleep while reading?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : చదువుకుంటున్నప్పుడు మనలో చాలా మందికి నిద్ర వస్తుంది . ఎందుకని?.

రాము . . దేశిల్ల వీధి -శ్రీకాకుళం టౌన్‌.

జ : చదివేటపుడు నిద్ర రావడమనేది మనము ఏ భంగిమలో ఉన్నాము ... ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది . చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన కండరాలకు ప్రవహించే రక్తము తగ్గుతుంది . దాని ములాన కండరాలలోని జీవకణాలలో దహనచర్య (combustion) మందగించి " లాక్టిక్ యాసిడ్ " అనే ఆమ్లము తయారవుతుంది . ఈ ఆమ్లము ప్రాణవాయువైన ఆక్షిజన్‌ ను అతిగా గ్రహిస్తుంది . . దాంతో దేహములోని రక్తానికి కావలసిన ఆక్షిజన్‌ లో కొంత తగ్గుదల వస్తుంది . ఆక్షిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా , నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది . అందుకే చదివేటపుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటూ కదలడం , ఏకుబికిన చదవకుండా మధ్యలో కాస్త విరామము ఇవ్వడం చేస్తే నిద్ర రాదు .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...