Saturday, June 04, 2011

వాటికి పసుపు రంగు ఇష్టమా?, Do they like yellow color?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: పసుపు రంగు గాజు పెట్టెలు బొద్దింకలకు బోనుల్లాగా పనిచేస్తాయి. ఎందుకు?

-పి. సుందరి, 8వ తరగతి, అరకులోయ (విశాఖ)

జవాబు: మనం చూడగలిగినట్టు ప్రాణులన్నీ వివిధ రంగులను చూడలేవు. బొద్దింకలు (కాక్రోచ్‌) పసుపు రంగును చూడలేవు. ఎందుకంటే వాటి కళ్లలో ఆ రంగు పౌనఃపున్యానికి స్పందించే కణాలు ఉండవు. అందువల్ల వాటికి పసుపు రంగు నలుపుగా కనిపిస్తుంది. అందువల్లనే పసుపు రంగు గాజు పెట్టెను అవి చీకటి ప్రాంతంగా భ్రమించి అక్కడ క్షేమంగా దాక్కోవచ్చనే భావనతో అందులోకి చేరుకుంటాయి. అందుకనే ఆ రకమైన పెట్టెలను వాటికి బోను (trap)ల్లాగా ఉపయోగించి వాటి బెడదను వదిలించుకుంటారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...