Wednesday, February 16, 2011

భూమి నుంచి వేడి నీళ్లు తన్నుకుని వస్తాయెందుకు?, Why do hot water spring out in some places of Earth?




ప్రశ్న: కొన్ని చోట్ల భూమి నుంచి వేడి నీళ్లు తన్నుకుని వస్తుంటాయి కదా? దానికి కారణం ఏమిటి?

-కె. అంబిక, 10వ తరగతి, గోదావరిఖని

జవాబు: కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడినీరు ఫౌంటెయిన్స్‌లాగా బయటకి తన్నుకొచ్చే ప్రాంతాలను వేడినీటి బుగ్గలు (గీజర్లు) అంటారు. భూమి అంతర్భాగంలో అత్యధికమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలిసిందే. భూమి లోపలి పొరల్లో ఉండే భూగర్భజలాలు కొన్ని ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలకు గురవుతూ ఉంటాయి. సాధారణంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడే ప్రాంతాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. భూగర్భజలాలు వంద డిగ్రీల సెంటిగ్రేడుకు మించి వేడెక్కినప్పుడు నీరు ఆవిరై ఆయా ప్రాంతాల్లో క్రమంగా పీడనం పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి వల్ల భూమి లోపలి పొరల్లోని నీరు భూమి నెర్రల ద్వారా ఉవ్వెత్తుగా పైకి తన్నుకొచ్చేస్తుంది. ఈ పరిస్థితులు అమెరికా, రష్యా, చిలీ లాంటి కొన్ని ప్రదేశాల్లోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌(Eenadu_Hai bujji)


  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...