Saturday, February 19, 2011

కాంతి సంవత్సరం అంటే ఏమిటి?, What is Light year?




కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం ఉంటుందంటే, ఒక గోళం కాంతి మరొక గోళాన్ని చేరడానికి ఏళ్ళకి ఏళ్ళే పడుతూ ఉంటుంది. అంచేత వాటి మధ్యనున్న దూరాన్ని కొలవడానికి దీన్ని వాడతారు. ఇక్కడ మరో విశేషం ఏవిటంటే, ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. అంచేత పెద్ద పెద్ద దూరాలని కొలవడానికి కాంతి సంవత్సరానికి మించిన ప్రమాణం లేదు.


కాంతి కిరణం ఒక సెకను కాలంలో మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందంటే ఆశ్చర్యం గా లేదూ? అటువంటి కాంతి కిరణం ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? అది 9.3 × 10¹⁵ మీటర్లు. ఈ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఇది 9 లక్షల 50 వేల కోట్ల కి.మీ.(9.3 × 10¹⁵ మీటర్లు.)


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...