* బంగారం ప్రస్తావన వేదాల్లోనూ కనిపిస్తుంది. ఇక ఏ పురాణాన్ని తీసుకున్నా దేవతల నగలన్నీ బంగారంతో చేసినవేగా? సింధు నాగరికత కాలంలోనే బంగారు నగలను ధరించినట్టు ఆధారాలున్నాయి. ఆభరణాలు చేసేటప్పుడు స్వర్ణకారులు బంగారాన్ని కాజేసే విధానాలను కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు కూడా.
* ఈజిప్టులో క్రీస్తు పూర్వం 2,600లోనే బంగారాన్ని వాడేవారు. లిడియా వారైతే గ్రీకులతో బంగారు నాణాలతోనే వ్యాపారం చేసేవారు. పర్షియన్ రాజు లిడియాను జయించిన తర్వాత బంగారు నాణాల వాడకం మొదలైంది.
* గనుల్లో మట్టి, రాళ్ళలో చిక్కుకుపోయి ఉండే బంగారాన్ని వెలికి తీయడం చాలా కష్టం. వెయ్యి కిలోల మట్టి నుంచి అరగ్రాము బంగారం లభిస్తుందని అంచనా. బంగారం ఉత్పత్తిలో ఇప్పుడు చైనాదే అగ్రస్థానం. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాల్లో కూడా బంగారం గనులున్నాయి. మన దేశంలో కర్ణాటకలోని కోలార్‌లో ఉన్నాయి.
* భూకేంద్రంలో 10,000 కోట్ల టన్నుల వరకు బంగారం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. మరో 1,000 కోట్ల టన్నులు సముద్రాల్లో ఉందట.
* ప్రపంచం మొత్తం మీద 2009 వరకూ సుమారు 1,60,000 టన్నుల బంగారాన్ని వెలికి తీసినట్టు అంచనా. దీనితో 20 మీటర్ల భుజం ఉండే ఘనం తయారవుతుంది.
source : Eenadu new paper .
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...