Monday, February 21, 2011

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లము పెడతారో వారిమాటే చెల్లుతుందా?, Cummin seeds and jagary importence in hindu marriage



జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. మనుష్యుల శరీరములొ విద్యుత్ దాగిఉంటుంది . అదే జీవశక్తి వివాహ సమయం లో ఎవరు ముందుగా జీలకత్త బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది . ఆ ప్రవాహశక్తి జీవితాంతం పనిచేస్తుంది అని , ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో మారిమాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం .జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయము గా అయితే పెళ్ళి కూతురు తో ముందు పెట్టిస్తారు .

మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాల ప్రధానమైన అంశము. కానీ, మనలాంటి చాలామందికి, వివాహ సమయంలో చెసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు (ఉదాహరణకు: స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర-బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి...). వివాహం చేసుకునేవాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్ధము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడంవల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము.

వేద మంత్రములతో, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా ముత్తయిదువులు మంగళ గీతములు ఆలాపన చేయగా వధువు, వరుని నెత్తిపై జీలకర్ర, బెల్లం ముద్దగా చేసినది పెడుతాడు. అట్లే వధువు నెత్తిన జిలకర్ర, బెల్లం ముద్దగా చేసి బ్రహ్మరంధ్రం వద్ద ఉంచుతారు. ఈ సందర్భంలో పెళ్లికుమారుడు ఈ మంత్రాన్ని చెబుతాడు.

అబ్రత్రుఘ్నీం వరుణ అపరిఘ్నీం బృహస్పతే ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితంస్స :

ఓ వరుణదేవా! సవిత వలన ఈమెకు కలిగిన లక్ష్మీసోదరులకు అభివృద్ధిని కలిగించాలి. నీ దయవల్ల ఓ బృహస్పతీ ఈమె భర్తకు అభివృద్ధిని కలిగించేది కావాలి. ఇంద్రా! ఈమె పుత్రసంతానం పొందునట్లు అనుగ్రహించు.



  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...