Monday, February 28, 2011

టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?,Tomato juice is not coming out easily Why?




ప్రశ్న: టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?

-కె. నటరాజన్‌, ఇంటర్‌, తిరుపతి

జవాబు: టమాటా సాస్‌ అనేది టమాటాలు, సుగంధ ద్రవ్యాలు, కొన్ని మసాలా దినుసులు కలిపి తయారు చేసిన చిక్కని పదార్థం. దీనికి స్నిగ్ధత (viscosity) ఎక్కువగా ఉంటుంది. అదే నిండుగా నీరున్న సీసా నుంచి నీటిని పోయడం సులభం. ఎందుకంటే సీసాలోని నీరు కొంత వెలుపలకు రాగానే, దాని అడుగున ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించడానికి బయట ఉండే గాలి సీసా మూతి గుండా నీటిలోకి ప్రవేశించి ప్రయాణిస్తుంది. కానీ టమాటా సాస్‌ స్నిగ్ధత ఎక్కువ కావడం వల్ల గాలి బుడగలు దాని గుండా సులభంగా ప్రవేశించలేవు. అందువల్ల సీసా అడుగు భాగాన శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. తద్వారా పీడనాల తేడా ఏర్పడి, ఆ ప్రభావం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పని చేస్తుంది. దాంతో సాస్‌ బయటకు రాకపోగా సీసా అడుగు వైపునకు లాగబడుతుంది. అందువల్లనే సాస్‌ను బయటకి రప్పించడానికి సీసా అడుగుభాగాన్ని తట్టడమో, సీసాను విదిలించడమో చేయాల్సివస్తుంది. అదే ప్లాస్టిక్‌ సీసా అయితే దాని పక్క భాగాలను నొక్కి ఒత్తిడి కలిగించడం చేయవచ్చు. అలాగు సీసాలోకి ఒక స్ట్రాను నిదానంగా అడుగుభాగం వరకు గుచ్చితే, దాని గుండా బయటి గాలి అక్కడకి చేరుకుని సాస్‌ సులువుగా బయటకి వస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...