ప్రశ్న: శత్రువుల బారి నుంచి తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయి?
-బి. సరోజిని, 9వ తరగతి, ఏలూరు
జవాబు: తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో తేనెటీగ చనిపోతుంది. అందువల్ల శత్రువుల బారి నుంచి తప్పించుకోడానికి తేనెటీగలు మరో విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తాయి. ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు. అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు. అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి. తద్వారా వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి. ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...