ప్రశ్న: అన్ని ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా, మరి కేవలం గోరింటాకు పెట్టుకుంటేనే చెయ్యి పండడం ఎందుకు?
-ఎ. కిరణ్మయి, పిడుగురాళ్ల
జవాబు: పచ్చగా కనిపించినంత మాత్రాన ఆకులన్నింటిలో పత్రహరితం (క్లోరోఫిల్) ఒక్కటే ఉందనుకోకూడదు. క్లోరోఫిల్‌తో పాటు ఎన్నో రసాయనిక ధాతువులు ఆకుల్లోని పత్ర కణాల్లో ఉంటాయి. గోరింటాకు, మందారంలాంటి ఆకుల్లో ఆమ్లగుణం గల ఫినాళ్లు ఉంటాయి. ఇవి గోరు, చర్మం మీద ఉండే మెలనిన్ అనే ప్రొటీనుతో రసాయనిక బంధంగా ఏర్పడతాయి. అప్పుడు కలిగే అణునిర్మాణం వల్ల అంతవరకూ వేరే రంగులో ఉన్న చర్మం క్రమేపీ ఎరుపు రంగులోకి మారుతుంది. ఇతర మొక్కల ఆకుల్లో ఇలాంటి లక్షణాలున్న ఫినాళ్లు లేకపోవడం వల్ల వాటిని పూసుకున్నా పండవు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...