Wednesday, September 22, 2010

మనిషి శ్వాసలో మర్మమేమిటి? , What is the Secrete of human respiration?



ప్రశ్న: మనిషి శ్వాస ద్వారా లోపలికి తీసుకునే ఆక్సిజన్‌ ఖర్చయిపోతే, మరి నిశ్వాసంలో వదిలే కార్బన్‌డయాక్సైడులో ఆక్సిజన్‌ ఎందుకుంది? హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల సమ్మేళనమైన నీటిలో మునిగితే ఎందుకు ఊపిరి ఆగుతుంది?

-వి. శ్రీనివాసరెడ్డి, సూర్యాపేట

జవాబు: జీవన ప్రక్రియలో ఒక పదార్థాన్ని వాడుకోవడమంటే పూర్తిగా ద్రవ్యరాశి నశించడమని అనుకోకూడదు. వాటిలోని రసాయనిక శక్తిని వాడుకోవడమే. గాలిలో ఉండే ఆక్సిజన్‌ (02)కి, కార్బన్‌ డయాక్సైడు (CO2)లో ఉండే ఆక్సిజన్‌కి రసాయనికంగా తేడా ఉంది. ఈ తేడా రసాయనిక శక్తి రూపంలో ఉంటుంది. అలాగే గాలిలోని ఆక్సిజన్‌కి, నీటిలో (H2O) రూపంలో ఉండే ఆక్సిజన్‌కి చాలా తేడా ఉంది. గాలి ద్వారా మనం పీల్చుకునే ఆక్సిజన్‌తో పోషక పదార్థాలు చర్య జరిపి శక్తినిస్తాయి. నీటిలో ఉండే ఆక్సిజన్‌ ద్వారా అలా జరిగే వీలు లేదు. ఇక నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను గ్రహించే అవయవాలు లేనందున మనిషి మునిగితే చనిపోతాడు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...