ప్రశ్న: 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'ను ఎందుకు నిర్మించారు?
-కె. బద్రి, 9వ తరగతి, గుంటూరు
జవాబు: గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోకెల్లా పొడవైన గోడ. దీని పొడవు సుమారు 8851 కిలోమీటర్లు. ఈ గోడను క్రీస్తుపూర్వం 221 సంవత్సరంలో నిర్మించడం మొదలు పెట్టారు. పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టింది. రాళ్లతో, ఇటుకలతో కట్టారు. మంగోలియన్ల దాడి నుంచి చైనాను రక్షించడానికి దీన్ని నిర్మించారు. ఒకప్పుడు చిన్నచిన్న రాష్ట్రాల రూపంలో విడివిడిగా ఉండే చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చిన చక్రవర్తి షిహూయాంగ్ దేశ రక్షణ కోసం ఈ గోడను నిర్మించాడు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. ఆ గోడ అనేక చోట్ల పగిలిపోవడంతో మంగోలియన్లు చైనాపై అనేక దండయాత్రలు చేశారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...