ప్రశ్న: ప్లాస్టిక్‌ను ఎలా తయారు చేస్తారు?
జవాబు: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్'. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్ ఆయిల్'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...