ప్రశ్న: ఇన్‌వార్ స్టీలు అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?
-కె. చంద్రమౌళి, 9వ తరగతి, చిన్నగంజాం (ప్రకాశం)
జవాబు: ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వాచీలు, బ్యాటరీ గడియారాలు వస్తున్నాయి కానీ, అంతకు ముందు స్ప్రింగ్‌లు, లోలకాలతో తయారయ్యే గడియారాలు ఉండేవి. వీటి లోపలి భాగాలను లోహాలతో తయారు చేయడం వల్ల, పరిసరాల ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల ఇవి వ్యాకోచించడమో, సంకోచించడమో జరిగేది. ఫలితంగా అవి చూపించే సమయాలు కచ్చితంగా ఉండేవి కావు. ఒకో రుతువులో ఒకోలా ఉండేవి. అలాగే దూరాన్ని కొలిచే టేపులను కూడా ఇనుము, స్టీలు లోహాలతో చేయడం వల్ల సంకోచవ్యాకోచాల కారణంగా కొలతలు మారుతుండేవి. అందువల్ల ఉష్ణోగ్రత మార్పులకు పెద్దగా ప్రభావితం కాని లోహం కోసం అన్వేషించారు. అదే ఇన్‌వార్ (Invar) స్టీలు. దీన్ని స్టీలు, నికెల్‌లను 64:36 నిష్పత్తిలో మిశ్రమించి తయారు చేస్తారు.
ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...